సాంకేతికత పెరుగుతున్న తరణంలో స్మార్ట్ ఫోన్లలో కనివిని ఎరుగని రీతిలో కొత్తకొత్త వెర్షన్లు వచ్చేస్తున్నాయి. తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం మైక్రో సాఫ్ట్ అవుట్ లుక్ లైట్ వెర్షన్ యాప్ ను తీసుకొచ్చింది. మెయిన్ యాప్ కు లైట్ వెర్షన్ గా ఇది ఉంటుందని కంపెనీ తెలిపింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ (తక్కువ సామర్థ్యంతో ఉండేవి) యూజర్ల కోసం దీన్ని రూపొందించింది. అవుట్ లుక్ లైట్ యాప్ సైజు కేవలం 5ఎంబీతో ఉంటుంది. దీంతో 1జీబీ, 2జీబీ ర్యామ్ ఫోన్లలోనూ ఈ యాప్ చక్కగా పనిచేయనుంది.
అయితే అవుట్ లుక్ మెయిన్ యాప్ తో పోలిస్తే లైట్ యాప్ లో కొన్ని ఫీచర్లు ఉండవు. ఇక ఐఫోన్ యూజర్లకు లైట్ యాప్ ను అందుబాటులో ఉండదు. భారత్ తో పాటు, ఆసియా దేశాల్లో ఈ లైట్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అవుట్ లుక్ ప్రకటించింది. ఈ మెయిల్స్, క్యాలెండర్, కాంటాక్టులు తదితర సేవలను అవుట్ లుక్ అందిస్తుంటుంది. యాప్ సైజు తక్కువగా ఉన్నందున వేగంగా స్పందిస్తుంది. 2జీ, 3జీ సహా అన్నిరకాల టెక్నాలజీపైనా పనిచేస్తుంది.