కడప జిల్లాలో రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు వేంపల్లె పాపగ్ని నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో నది వద్ద నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీని కారణంగా వేంపల్లి మండలంలోని తువ్వపల్లె - అలిరెడ్డి పల్లె గ్రామాలకు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. అయినప్పటికీ పనుల నిమిత్తం వెళ్లే కూలీలు ప్రవహించే నదిలో దాటుకుంటూ పనులకు వెళ్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa