గురజాల: భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండల పరిధి గొట్టెముక్కలలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శృతికి 13 సంవత్సరాల క్రితం మోషతో వివాహమైంది. ఆమెపై అనుమానంతో అతను వేధింపులకు గురి చేస్తున్నాడు. బలవన్మరణానికి పాల్పడేందుకు కుమార్తెతో పెట్రోల్ తెప్పించుకుంది. ఇంట్లో బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు ఆమెను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.