ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి చనిపోయిన సంగతి తెలిసిందే. ఏది కేవలం చంద్రబాబు, లోకేష్ ల వత్తిడి వలన జరిగిన మరణం అని లక్ష్మి పార్వతి మీడియా ముఖంగా తెలియజేసారు. ఐతే దీనిపై స్పందించిన టీడీపీ వర్గీయులు మాట్లాడుతూ... అమ్మా లక్ష్మీ పార్వతి... తమరు మాట్లాడాలనుకుంటే తెలుగు అకాడమీ నిధులు స్వాహా కేసుల గురించి మాట్లాడండి.
లేదా మీరు వెలగబెడుతున్న పదవిలో మీరేం చేసారు... ఏం చేయబోతున్నారో చెప్పండి. మీకు ఎన్టీఆర్ పట్ల గౌరవం ఉంటే వైసీపీ వాళ్ళు ఆయన విగ్రహాలను కూల్చినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? ఉమామహేశ్వరి అంటే ఎన్టీఆర్ కు ఎంత ఇష్టమో అందరికీ తెలుసు.
అటువంటి వ్యక్తి చనిపోతే ఎన్టీఆర్ పట్ల అభిమానం ఉన్న ఎవరైనా బాధపడతారు.మీరు మాత్రం అటు దహనసంస్కారాలు జరుగుతుంటే. ఇటు సాక్షి లైవ్లోకి వచ్చి ఆ కుటుంబాన్ని అనరాని మాటలు అన్నారు. ఎంగిలి మెతుకుల వంటి పదవుల కోసం ఇంత అమానవీయమా? అని ప్రశ్నించారు.