వైసీపీ లీడర్లలో చాలా మంది కామప్రకోపంతో పిచ్చి చేష్టలు చేస్తున్నారు. అది అర్హత అనుకున్నారో ఏమో గానీ వాళ్లలో కొంతమందికి జగన్ రెడ్డి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వైసీపీ పాలనలో కామ పిశాచాలకు లైసెన్స్ ఇచ్చినట్లయింది. అందుకే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో ఇలా చక్కర్లు కొడుతోంది అని టీడీపీ నాయకులూ వాపోతున్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పై స్పందించిన టీడీపీ నాయకులూ మాట్లాడుతూ.... ఎస్సీ మహిళపై అత్యాచార కేసులో ముద్దాయిగా ఉండి రెండు నెలల జైలు శిక్ష అనుభవించిన గోరంట్ల మాధవ్‌కి హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంటుకు పంపాడు జగన్ రెడ్డి. అతగాడు పిల్లలు కలిగిన ఒక మహిళతో సహజీవనం చేస్తూ.. పిల్లలను అడ్డు తొలగించే ప్రయత్నం చేసినట్టు చెప్పుకుంటున్నారు.
ఎంపీగా ఉండి ఇలాంటి పనులు చేస్తున్న వాడు పోలీస్ శాఖలో ఇంకెన్ని చేసాడో! ఇప్పటికైనా జగన్ రెడ్డి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటారా? లేక మనం మనం నేరగాళ్లం అని సరిపెట్టుకుంటారా? అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.