ఉరవకొండ నియోజకవర్గం, విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో గురువారం 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డికి ఘన స్వాగతం పలికారు.
సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయ లేదా అని తెలుసుకున్నారు.