భారతీయ రైల్వేతో అమెజాన్ డీల్ కుదుర్చుకుంది. 110కి పైగా పట్టణాల మధ్య ప్యాకేజీలను రవాణా చేసుకోవడానికి అమెజాన్ తో రైల్వే ఒప్పందం చేసుకుంది. దీనివల్ల తన డెలివరీ సేవలను అమెజాన్ మరింత వేగవంతం చేసుకునే అవకాశం ఉంది. కస్టమర్లకు ఏ వస్తువు అయినా రెండు రోజుల్లోనే డెలివరీ చేయొచ్చు. 2019 నుంచే రైల్వే, అమెజాన్ మధ్య ఈ వ్యాపార భాగస్వామ్యం ఉంది. తాజాగా వారి ఒప్పందం మరింత బలపడిందని అమెజాన్ ప్రకటించింది.