ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఇంట విషాదం నెలకొంది. పుష్ప శ్రీవాణి తండ్రి పాముల నారాయణమూర్తి గత రాత్రి గుండెపోటుతో మరణించారు. బుధవారం రాత్రి నారాయణమూర్తికి గుండెపోటు రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తరలించి వైద్యం అందించారు. సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నారాయణమూర్తి మరణంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.