పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాకు చెందిన కుల్దీప్ సింగ్ అనే కానిస్టేబుల్ లాటరీలో రూ.కోటి గెలుచుకున్నాడు. లాటరీ కొనాలని తన తల్లి సూచించడంతో కుల్దీప్ కొన్ని లాటరీ టికెట్లు కొన్నాడు. వాటిలో ఆరు రూపాయలు పెట్టి కొన్న లాటరీ ఆయనను కోటీశ్వరుడిని చేసింది. 'లూధియానా గాంధీ లాటరీ' దుకాణంలో ఈ టికెట్ ను విక్రయించారు. గడిచిన 3 నెలల్లో రూ.3 కోట్ల విలువైన లాటరీలను లబ్ధిదారులకు అందించినట్లు వారు తెలిపారు.