ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన చంద్ర అనే కేటుగాడు ఒంటరి మహిళలే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నాడు. ఇటీవల తిరుపతిలో తాను బంగారం వ్యాపారినని మహిళలకు మాయమాటలు చెప్పి, లాడ్జిలకు తీసుకు వెళ్లి మత్తు మందు ఇచ్చి ఒంటిపై బంగారం దోచేశాడు. తాజాగా ఇదే మోసగాడు విజయవాడలో భవానీపురానికి చెందిన మహిళ వద్ద 36 గ్రాములు, మరో మహిళ వద్ద 52 గ్రాముల బంగారం దోచుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.