భారతీయ మహిళలు ఎందులోనూ తక్కువ కాదని మరోసారి నిరూపించారు. తాజాగా ఇండియన్ నేవీ మహిళా బృందం ఉత్తర అరేబియా సముద్రంలో సముద్ర నిఘాను పూర్తి చేసింది. బుధవారం అత్యాధునిక డోర్నియర్ 228 విమానంలో ఈ నిఘా పూర్తి చేశారు. ఈ మిషన్ కమాండర్ గా లెఫ్టినెంట్ సీడీఆర్ ఆంచల్ శర్మ నాయకత్వం వహించారు. ఫైలెట్లుగా శివంగి, అపూర్వ గీతే.. టాక్టికల్ ఆఫీసర్ గా పూజా పాండే, సెన్సార్ ఆఫీసర్ గా ఎస్ఎల్టీ పూజా షెకావత్ వ్యవహరించారు.