గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లోనే కాకుండా ప్రతి వార్త పత్రికలోనూ అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కి సంభందించిన న్యూడ్ వీడియో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు మాత్రం వైసీపీ పార్టీని, ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై స్పందించిన కొందరు టీడీపీ నాయకులూ .... గంట... అరగంట...గోరింటాకు.... జగన్ రెడ్డి నవరత్నాల్లో మూడు తేలినాయి. బయట పడని రత్నాలు ఎన్నో. ఆంబోతుకు అచ్చేసి రోడ్డు మీదకు వదిలినట్టు, జగన్ రెడ్డే వీళ్ళకు వైసీపీ కండువా వేసి వదిలినట్టుంది. లేకపోతే వీళ్ళు ఎవరి మీద ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోరు?అని సోషల్ మీడియా లో ట్వీట్స్ చేస్తున్నారు.