జుగుప్సాకరమైన నగ్న వీడియోలతో దేశంలో ఏపీ పరువు తీసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఆ వీడియోను కుట్రగా పేర్కొంటూ తన పేరును చెప్పడంపై తెలుగుదేశం యువనేత చింతకాయల విజయ్ ఘాటుగా స్పందించారు. పనిగట్టుకుని కుట్ర చేసేంత సీన్ మాధవ్ కి లేదన్నారు. మంత్రులతో సహా ఇప్పటికే వైసీపీ నేతలు ఇలా ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలియనిది కాదు. ప్రభుత్వం మీదే కాబట్టి పవర్ మీ చేతల్లో ఉంది కదా, ఇంకా మా మీద నెపం వెయ్యడం కంటే దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశాలు జారీ చెయ్యండి. ఏది నిజమో ప్రజలకి కూడా పూర్తిగా అర్థమవుతుంది అని అన్నారు.