వైఎస్ జగన్‌రెడ్డి శివకుమార్ నుంచి ముందుగా లీజుకి తీసుకుని ఆ తరువాత పూర్తి యాజమాన్య హక్కులు సంపాదించిన యువజన శృంగార రసిక చిలిపి పార్టీ పేరుని సార్థకం చేసే మరో ట్రెండ్ సెట్టర్ ఎంపీ గోరంట్ల మాధవ్ అని టీడీపీ నాయకులూ బుద్దా వెంకన్న మాట్లాడారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పై స్పందిస్తూ... వైఎస్సార్సీపీ ఆశీస్సులతో ఇప్పటివరకూ అవంతి అరగంట సరసం, అంబటి గంట విరహం ఆడియోలు బయటకొస్తే..వారిపై జగన్‌రెడ్డి ఏం చర్యలు తీసుకోలేదు. పార్టీ బ్రాండింగ్ అయిన ఇటువంటి రాసలీలలు చేయడం కాదు, బయటపెట్టుకుంటేనే అధినేత గుర్తిస్తున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్‌గా మహిళని సెక్సువల్ హెరాస్ చేస్తూ వీడియో వదిలారు. ఇప్పుడు ఎంపీపై చర్యలు తీసుకుంటారో, అంబటిలా పదవి ఇచ్చి గౌరవిస్తారో చూద్దాం అని తెలియజేసారు.