వైసీపీ నేతలు మదమెక్కిన ఆంబోతుల్లా ఊరిమీద పడి మహిళల మానప్రాణాలు తీస్తుంటే...వారిపై కనీస చర్యలు ముఖ్యమంత్రి జగన్రెడ్డి తీసుకోవడంలేదు అని టీడీపీ నాయకులూ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తపరిచారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసుల కాల్ రికార్డింగ్స్ పై ఆయన స్పందిస్తూ... మహిళలపై లైంగికదాడులకి పాల్పడినవారికి మంత్రి పదవులు కట్టబెడుతున్నారు. వైకామకేయుల్ని ఊరి మీదకి వదిలి దిక్కులేని దిశచట్టం తెచ్చారు. మహిళలకి ఇంకెక్కడి రక్షణ? అని ఆవేదన వ్యక్తపరిచారు.