ఉచిత నిర్భంద విద్యా హక్కుచట్టం అనుసరించి 2022- 23 విద్యాసంవత్సరం నుంచి ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశాలు అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందులో భాగంగా అనాథలు, హెచ్ఐవీ బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాలకు (బీసీ, మైనార్టీ, ఓసీ) చెందిన పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు.
అర్హత కలిగిన పిల్లలకు ఒకటో తరగతి విద్యార్థుల నమోదులో 25 శాతం సీట్లు కేటాయించి ఫీజు రీయింబర్స్మెంట్ పద్ధతిన ప్రవేశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ. 1. 20 లక్షలు, పట్టణ ప్రాంతంలో వారికి రూ. 1. 40 లక్షల లోపు ఉండాలన్నారు. ఆన్ లైన్ ద్వారా ఈ నెల 16 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు. విద్యాశాఖ https://cse.ap.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేయాలన్నారు.