ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్ లు జిల్లాలలో నిర్మాణ పురోగతి లో ఉన్న ప్రాధాన్యతభవనాలు, అమృత్ సరోవర్ పనులు, జలజీవన్ మిషన్ పనులు, స్వచ్ఛ సంకల్ప పథకాల అమలు తీరు పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.