ప్రతి ఒక విద్యార్థి అభివృద్ధి పథంలో నడవాలని కందుల ఓబుల్ రెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ లిఖిత రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చింతకొమ్మదిన్నె మండలం పరిధిలోని కే ఓ ఆర్ ఎం కాలేజీలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి అభివృద్ధి పథంలో నడవాలని అందుకోసం దేవుని దయతో పాటు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని విద్యను అభ్యసించాలన్నారు. కళాశాలలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం కోసం నిర్వహించామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గిరిధర్ ఆకుల, చంద్ర కళ, రమేష్ బాబు, రెడ్డి ప్రసన్న, రెడ్డి మురళి, జ్యోతిర్మయి, శ్రావణి, హరిత, లావణ్య, గంగలథ, విశ్వనాథ్ రెడ్డి, రవిశంకర్, కమలాకర్, రాములు, పాల్గొన్నారు.