బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ పై మాజీ చీఫ్ విప్ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ సత్యకుమర్ మాటలకు తీవ్రంగా ఖండిస్తున్నామనిఆన్నారు. సత్యకుమార్ పేరు కాదు అసత్యకుమర్ పేరు పెట్టుకోవాలనీ కోరారు. ఎపి లోని బిజేపి ని బాబు జనతా పార్టీ అని మార్చేశారుసత్యకుమర్ తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తున్నడు టిడిపి పార్టీని బలోపేతం చేస్తున్నాడు. కర్నూలు లో హైకోర్టు పెట్టాలని డిక్లరేషన్ చేశారు. దీనిపై మీ నిర్ణయం ఏమైందనీ ప్రశ్నించాడు.
అమరావతిలో పూర్తిగా స్కాం జరిగిందని గతంలో బిజేపి నాయకులు విమర్శలు చేసింది వాస్తవం కాదా ఇప్పుడు కర్నూల్ లో న్యాయ రాజధాని ఉండడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు. వైజాగ్ ను అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్న దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. బిజేపి పార్టీ రాయలసీమకు ఏమి చేశారు. రాష్ట్రానికి రాయలసీమకు మేలు చేసింది కేవలం రాజశేఖర్ రెడ్డి, సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు.