వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వికృత చేష్టలు మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్. శ్రీనివాస రెడ్డి అన్నారు. వైసీపీ నేతల వికృత చేష్టలపై మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పై ఎవరూ ప్రశ్నించకూడదా? అని అడిగారు. దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం టీడీపీకి లేదు అంటూ శ్రీనివాస రెడ్డి ఒక ఒక ప్రకటనలో తెలిపారు. తాము ఎటువంటి తప్పుచేసినా ప్రశ్నించకూడదు, ప్రసారం చేయకూడదు, ప్రచురించకూడదు అనే ధోరణిలో వైసీపీ నేతలు ఉన్నారు అన్నారు.