మన బడి మన బాధ్యత - మన ముఖ్యమంత్రికి మన విన్నపాలు అంశంపై వైఎ స్పార్టీఎఫ్ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను అనంతపురం పర్యటనకు వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామి రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవిష్కరించారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మర ఓబుళపతి, హెచ్. గిరిధర్ రెడ్డి, గంగాధర్‌రెడ్డి, అల్తాఫ్ హుస్సేన్, వీరాం జనేయులు, నాగేంద్ర, త్యాగరాజు పాల్గొన్నారు.