సిక్కింకు చెందిన హేమంత్ శర్మ(25) అధిక సంపాదన కోసం మోసాలు చేయడంలో ట్రిపుల్ సెంచరీ దాటేశాడు. ఇంకా మోసాలు చేస్తుండగా గురుగ్రామ్ పోలీసులకు దొరికాడు. సోషల్ మీడియాలో 150కి పైగా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి తనను తాను ఫైలట్ గా చెప్పుకుంటూ, 300కు పైగా అమ్మాయిలను నమ్మించాడు. 60కి పైగా సిమ్ కార్డులు మార్చుతూ, సోషల్ మీడియాలో పరిచయమైన అమ్మాయిల వద్ద డబ్బులు దోచేసిన సంగతి తాజాగా పోలీసుల విచారణలో తెలిసింది.