కాకుమాను: మండలంలో జగనన్న తోడు పథకంలో 408 మంది మహిళలకు రూ. 10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు ఏపీఎం సోమశేఖర్ తెలిపారు. జగనన్న తోడు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించిన సందర్భంగా రైతు భరోసా కేంద్రంలో జరిగిన సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. జడ్పీటీసీ షేక్ గుల్జార్ బేగం, నల్లమోతు శివరామకృష్ణ, తహసీల్దార్ జె. ప్రసాద్ రావు, ఎంపీడీవో హిరాలాల్, రాఘవరెడ్డి పాల్గొన్నారు.