నరసరావుపేట: ప్రేమించమని వేధిస్తున్నాడని ఓ విద్యార్థిని గురువారం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొండపల్లికి చెందిన యువతి(19) నరసరావుపేట లోని జేఎన్టీయూ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. విజయవాడకు చెందిన పరిసపోగు విజయ్ అనే యువకుడు ప్రేమించమని కొంతకాలంగా వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.