కామన్వెల్త్ గేమ్స్ 2022 లో గురువారం ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్- కెనడా జట్ల మధ్య జరుగుతున్న పురుషుల హాకీ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్టోఫర్ గ్రిఫిత్స్, కెనడాకు చెందిన బాల్‌రాజ్ పనేసర్ లు గొంతు, జెర్సీలు పట్టుకుని కొట్టుకునే దాకా వెళ్లారు. మ్యాచ్ మధ్యలో గొడవకు దిగిన వీరిని రెఫరీ రెడ్‌కార్డ్ చూపించి బయటకు పంపించారు.