తైవాన్ దేశం తమదేనంటున్న చైనా ప్రస్తుతం దుందుడుకు వైఖరితో ఉంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనపై చైనా భగ్గుమంది. ఈ క్రమంలో తైవాన్-చైనా మధ్య విబేధాలు మరోసారి ఉద్రిక్తతలకు దారి తీశాయి. దీంతో చైనా తైవాన్ జలసంధి వద్ద రెండు రోజులగా సైనిక విన్యాసాలు చేపడుతోంది. ఆ ప్రాంతంలో ప్రమాదకర డాంగ్ ఫెండ్ క్షిపణులను ప్రయోగించింది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.