మనం జీవితంలో ఎన్ని సాధించిన ఆశీర్వాలు సాధించడం చాలా కష్టం. ఓ బాలుడు తానుపడ్డకష్టతో దేశంలోని నలుమూలల నుంచి ఆశీర్వాదాలు మాత్రం సాధిస్తున్నాడు. ఆ ఆశీర్వాదం ఆ బాలుడిపాలిటావరంగా మారాలని ఆశిద్దాం. ఇక వివరాలలోకి వెళ్లితే...జీవితమంటేనే ఎన్నో మలుపులు.. ఊహించని అగాథాలు ఉంటాయి. కొన్ని అనుభవాలు వ్యక్తుల జీవితాలను తలకిందులు కూడా చేసేస్తాయి. అలాంటి ఓ విషాదం ఏడేళ్ల బాలుడి లైఫ్‌ని శాసించింది. తండ్రికి ప్రమాదం జరగడంతో ప్రపంచం తెలియని ఆ పసివాడు ఆ కుటుంబ బాధ్యతలను భుజానికెత్తుకున్నాడు. పోషణ కోసం పొద్దున్న స్కూల్‌కు వెళ్లి చదువుకుంటూనే.. సాయంత్రమైతే పని చేస్తున్నాడు. తండ్రి చేసే పనిలోనే చేరి.. పొట్ట కూటీ కోసం పాట్లు పడుతున్నాడు. ఓ కస్టమర్ ట్వీట్ ద్వారా ఆ పసివాడి వ్యథ.. అందరి ముందుకు వచ్చింది.
ఓ వ్యక్తి జొమాటో డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తూ ఓ ప్రమాదానికి గురయ్యాడు. దాంతో అతని ఏడేళ్ల కొడుకు తన కుటుంబం కోసం ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారాడు. తన తండ్రి ఉద్యోగాన్నే ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. ఉదయం పాఠశాలకు వెళ్తున్నాడు. సాయంత్రం ఆరు గంట నుంచి 11 గంటల వరకు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సైకిల్‌పై వెళ్తూ అందరికీ డెలివరీలు అందజేస్తున్నాడు.
రాహుల్ మిట్టల్ అనే వినియోగదారుడు సోషల్ మీడియాలో బాలుడి గురించి తెలియజేశారు. బాలుడితో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో కస్టమర్ (రాహుల్) బాలుడుతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. తన తండ్రి ఎన్‌రోల్ చేసిన ప్రొఫైల్‌కు యాప్‌లో బుకింగ్‌లు వస్తాయని, ఇప్పుడు తను ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని ఆ పిల్లవాడు చెప్పాడు. సైకిల్‌పై వెళ్లి ఆర్డర్‌లను ఇస్తుంటానని బాలుడు తెలియజేశాడు. అయితే ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందనేది తెలియాల్సి ఉంది. అలాగే ట్వీట్‌లో బాలుడి పేరును కూడా తెలియజేయలేదు.
ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఆ బాలుడి పరిస్థితిపై అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి ఉద్యోగంలో చేరి.. ధైర్యంగా బాధ్యతలను స్వీకరించిన బాలుడి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. కానీ ఈ పరిస్థితి నుంచి వీలైనంత త్వరగా ఆ బాలుడు బయటపడాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. అతని తండ్రి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.