మనం ఒక్కరోజు సీఎం చూసివుంటా. ఒక రోజు బాద్ షా చూసివుంటాం. లేకపోతే ఇటీవల కొన్ని సంస్థల ఓదార్యంవల్ల ఓ రోజు కలెక్టర్, ఎస్పీ ఇలాంటి సన్నివేశాలను చూసివుంటాం. కానీ కూలీ కాస్త కొన్ని నిమిషాల కోటీశ్వరుడిగా మారడం మాత్రం అరుదుగానే చూస్తుంటాం. ఇక వివరాలోకి వెళ్లితే..ఉత్తరప్రదేశ్‌లో ఈ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అనూహ్యంగా ఓ కూలీ.. కోటీశ్వరుడుగా మారిపోయాడు. అతనికి తెలియకుండానే అకౌంట్‌లో కోట్లాది రూపాయలు పడ్డాయి. తన జన్‌ధన్ ఖాతాలో అన్ని కోట్లు ఉన్నాయని తెలుసుకుని మొదట షాకయ్యాడు. బీహారీ లాల్ (45) రాజస్థాన్‌లోని ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నాడు. రోజంతా పనిచేస్తే రూ.600 నుంచి రూ.800 సంపాదించేవాడు. అయితే వర్షాల వల్ల ఆ ఇటుక బట్టీ మూతబడింది.
దాంతో బీహారీ లాల్ కన్నౌజ్ జిల్లాలోని సొంత గ్రామానికి ఇటీవల తిరిగి వచ్చేశాడు. అయితే బీహార్ లాల్ రెండు రోజుల కిందట స్థానిక జన సేవా కేంద్రానికి వెళ్లాడు. తనకున్న జన్‌ధన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.100లు విత్‌డ్రా చేశాడు. వెంటనే తన ఫోన్‌కు మెసెజ్ వచ్చింది. ఆ మెసెజ్ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ మెసేజ్‌లో తన బ్యాంకు ఖాతాలో రూ.2,700 కోట్లు బ్యాలెన్స్ ఉన్నట్టు గమనించాడు.
వెంటనే బ్యాంకు మిత్రా సిబ్బంది దగ్గరకు వెళ్లాడు. తన బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బులు ఉన్నాయో చూడాలని కోరాడు. వారు ఒకటికి రెండుసార్లు చూసి.. ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నట్టు చెప్పారు. అంతేకాదు అకౌంట్ స్టేట్‌మెంట్ కూడా ప్రింట్ తీసి ఇచ్చారు. "నేను నా ఖాతాను మళ్లీ తనిఖీ చేయమని అడిగాను. ఆ తర్వాత అతను దానిని మూడుసార్లు తనిఖీ చేశాను. నేను నమ్మలేదు. అందుకు అతను బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసి నాకు ఇచ్చారు. నా ఖాతాలో రూ.2,700 కోట్లు పడి ఉండడం చూశాను.'" అని బీహారీ లాల్ మీడియాతో అన్నారు.
దాంతో బీహారీ లాల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. తన అకౌంట్‌లో కోట్లు ఉన్నాయని తెలుసుకుని బీహారీ లాల్ వెంటనే బ్యాంకు బ్రాచ్‌కు వెళ్లి.. అక్కడ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. తీరా అందులో రూ.126లు మాత్రమే ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా నిరాశ చెందాడు. తన ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నట్టు మొబైల్‌కు మెసెజ్ వచ్చిందని, ప్రింట్ తీసిన స్టేట్‌మెంట్‌ను కూడా బ్యాంకు అధికారులకు చూపించాడు. అయితే బ్యాంకింగ్ ఎర్రర్ వల్ల అలా జరిగి ఉంటుందని బ్యాంకు అధికారులు తీరిగ్గా చెప్పారు. అయితే ఈ విషయాన్ని బ్యాంకు ఉన్నతాధికారులు అంత తేలికగా వదల్లేదు. దీనిపై దర్యాప్తు చేయడానికి పూనుకున్నారు. దాని కోసం బీహార్ లాల్ బ్యాంక్ అకౌంట్‌ను కొంతసేపు సీజ్ కూడా చేశారు.
గతేడాది ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.. బీహార్‌లోని కతిహార్‌లో ఇద్దరు అబ్బాయిలకు బ్యాంకు అకౌంట్లలో భారీగా డబ్బు పడింది. దాంతో గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆరో తరగతి విద్యార్థులు గురుచరణ్ బిస్వాస్, ఆశిష్ కుమార్ ఖాతాల్లో రూ.900 కోట్లకుపైగా డబ్బు జమ అయింది. అయితే స్కూల్ యూనిఫామ్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన మొత్తం పొరపాటున బాలుర అకౌంట్లలో పడింది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన స్థానిక సెంట్రలైజ్డ్ ప్రిసెసింగ్ సెంటర్‌ని సందర్శించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.