సెలవు కావాలంటే ఏదో ఒక షాకు చెప్పి తీసుకొంటుంటారు. అది సరదా కోసమైనా ఇంట్లో విషయంలో బయటకు చెప్పడానికి ఇష్టంలేకపోయినా సరే. మా వాళ్లు చనిపోయారు. మా బంధువు చనిపోయారు. ఇలా ఎవరినో ఒకరిని షాకుగా చూపి సెలవు తీసుకొంటారు. కానీ ఓ ఉద్యోగి తన సెలువు ఎందుకో నిజాయితీతో చెప్పాడు. దీంతో అతని పై అధికార్లు అతను చెప్పిన కారణానికి కాస్త షాక్ కు గురయ్యారు.
ఆఫీసుల్లో ఉద్యోగులు జ్వరం వచ్చిందనో... ఊరు వెళ్లాలనో కారణాలతో సెలవులు తీసుకుంటుంటారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం వెరైటీ కారణంతో లీవ్ కోసం అర్జి పెట్టుకున్నాడు. ఇప్పుడా లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాన్పూర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని బుజ్జగించి తనను తీసుకురావడానికి మూడు రోజులు సెలవు ఇవ్వాలని కోరాడు.
కాన్పూర్‌కు చెందిన షమ్షాద్ అహ్మద్ అనే వ్యక్తి ఉత్తర్ప్రదేశ్ బేసిక్ శిక్షా అధికారి-బీఎస్ఏ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు అర్జంట్‌గా సెలవు కావాల్సి వచ్చింది. దాంతో ప్రేమ్ నగర్ బ్లాక్ అభివృద్ధి అధికారి (బీడీఓ)కి మంగళవారం లేఖ రాశారు. అందులో తనకు సెలవు కావాలని, అది ఎంత ముఖ్యమో వివరిస్తూ చెప్పారు. ఓ విషయంలో తన భార్యతో గొడవ జరిగిందని, దాంతో ఆమె పిల్లలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందని సర్దిచెప్పి ఆమెను తిరిగి తీసుకురావాలని అహ్మద్ తన లేఖలో పేర్కొన్నారు.
"నేను బాధపడుతున్నాను. ఆమెను తిరిగి వచ్చేలా ఒప్పించడానికి నేను ఆమె గ్రామానికి వెళ్లాలి. అందుకోసం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు అత్యవసర సెలవు కావాలి. దయచేసి నా సెలవు దరఖాస్తును అంగీకరించండి" అని హిందీలో ఆ లేఖలో రాశారు. అయితే షమ్షాద్ అహ్మద్ అభ్యర్థనను బీడీవో అధికారి ఆమోదించారు. ఆ ఆమోదించిన సెలవు దరఖాస్తు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లెటర్ చాలా విచిత్రంగా ఉండడంతో క్షణాల్లో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తెగ షేర్ చేస్తున్నారు.