టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి సహ-ఆతిథ్య జట్టు శ్రీలంక నిష్క్రమించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో 61 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. సొంత గడ్డపై, అభిమానుల మధ్య ఈ ఓటమి తమను తీవ్రంగా నిరాశపరిచిందని, ఇది చాలా సిగ్గుగా ఉందని కెప్టెన్ దసున్ షనక ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. ముఖ్యంగా చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు సమర్పించుకుని లంక బౌలర్లు పట్టు విడిచారు. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. కివీస్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర (4/27) దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa