వైఎస్ఆర్ కడప జిల్లా: మైదుకూరు మండల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 5 మంది స్మగ్లర్ల ముఠాను చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలకు వెళితే. జిల్లాలోని మైదుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ని జాండ్లవరం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను నరికి తరలిస్తున్న 5 మంది స్మగ్లర్ల నుండి 5 ఎర్రచందనం దుంగలు, మహీంద్రా కారు, రెండు గొడ్డళ్ళు, రంపం, 4 సెల్ ఫోన్లను మైదుకూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్టు చేసి దుంగలు స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన మైదుకూరు డి. ఎస్. పి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ లు నాగభూషణం, సత్యబాబు, మైదుకూరు అర్బన్ సి. ఐ చలపతి, ఎస్. ఐ సత్యనారాయణ, సిబ్బంది ని జిల్లా ఎస్. పి కే. కే. ఎన్ అన్బురాజన్ ఐ. పి. ఎస్ అభినందించారు.