ముఖ్యమంత్రి జగన్ ప్రగతి నిరోధకుడని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటు తులసి రెడ్డి విమర్శించారు. శనివారం తులసిరెడ్డి వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కారణంగా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుకాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన రూ. 1798కోట్లు ఇవ్వని కారణంఆ దాదాపు రూ. 1. 33 లక్షల కోట్లు విలువై కేంద్ర ప్రాజెక్టులు రాష్ట్రంలో నిలిచిపోయాయని ఆరోపించారు. ఇందులో రూ. 70వేల కోట్లు విలువ చేసే రైల్వేప్రాజెక్టులు రూ. 31400కోట్లు విలువచేసే రహదారులు రూ. 28వేల కోట్లు విలువైన గరిష్ట నిర్మాణ పనులు రూ. 2 రూ. 2884 కోట్లు విలువచేసే మిషన్ పనులు తదితర సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.