ప్రపంచ వ్యాప్తంగా 'ఫ్రెండ్షిప్ డే'ను జులై 30న జరుపుకుంటారు. అయితే భారత్లో మాత్రం ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డేగా పరిగణిస్తారు. ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయే వరకు మనకు స్నేహితులు ఏర్పడుతుంటారు. ముఖ్యంగా స్కూలు, కాలేజీలో ఏర్పడే స్నేహాలు ఎప్పటికీ మర్చిపోలేం. ఫేర్వెల్ డే వచ్చేటప్పటికీ అందరి కళ్లలో కన్నీళ్లు కనిపిస్తాయి.
జీవితంలో ప్రతి దశలోనూ ఏర్పడే స్నేహితులంతా ముఖ్యమే. పేద, ధనిక బేధం లేకుండా పయనం సాగించేది స్నేహ బంధం. ఎంత తిట్టుకున్నా, కొట్టుకున్నా నిజమైన స్నేహితులు వెంటనే కలిసి పోతారు. ఎవరితోనైనా మనస్పర్థలున్నా వాటిని తుంచేయడానికి ఇదే సరైన తరుణం. ఇప్పుడే మీ స్నేహితులకు విషెస్ చెప్పండి.