రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే ఉచితాలు ఇస్తున్నాయన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ట్విటర్ వేదికగా గట్టి కౌంటరిచ్చారు. 'ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలు మాఫీ చేసినట్లు చెప్తోంది. ఇందులో మెహుల్ చోక్సీ, రిషి అగర్వాల్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. దీనిని బట్టి ప్రభుత్వ నిధుల్లో మొదటి హక్కు ఎవరికి ఉంది..?’ అంటూ కేంద్రాన్ని వరుణ్ గాంధీ ప్రశ్నించారు.