యూపీలోని వారణాసిలో టాటూలు వేయించుకున్న ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. ఇటీవల 14 మంది అస్వస్థతో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేరారు. ఎంతకీ వారికి నయం కాకపోవడంతో వైద్యులు తాజాగా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. అందులో ఓ యువతి, యువకుడికి హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. కొన్నాళ్ల క్రితం వారంతా ఒకే చోట టాటూలు వేయించుకున్నారని, అందరికీ ఒకే సూది వాడి ఉంటారని డా.ప్రీతి పేర్కొన్నారు.