ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలక్ట్రికల్ లోకో వద్ద గుర్తు తెలియని మృతదేహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 07, 2022, 12:33 PM

విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నఎలక్ట్రిక్ లోకో వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. 35 నుంచి 45 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి రైలు కింద పడి మృతిచెందినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.మృతుడి చేతికి స్టీల్ కడియం ఉందని, చేతి వేళ్లకు స్టీలు ఉంగరాలున్నాయని అధికారులు తెలిపారు. 


అదే విధంగా కుడి చెవికి కూడా స్టీల్ రింగ్ ఉందని, నలుపు రంగు లోయర్, తెలుపు ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. లంకెలపాలెం నుంచి విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకునే బస్సు టిక్కెట్ అతడి వద్ద లభ్యమైందని స్పష్టం చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వాళ్లు విశాఖ జీఆర్పీ సిబ్బందికి తెలియజేయాలని, కేసు దర్యాప్తు చేపట్టామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించామని జీఆర్పీ ఎస్ఐ జి. బాలకృష్ణ (8985752107) ఓ ప్రకటనలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com