మనస్తాపంతో వివాహత ఆత్మహత్య చేసుకుంది. నాలుగో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. అక్కయ్యపాలెం నందనగిరి నగర్ కు చెందిన కొండపల్లి సునీత(25)కి, సురేశ్ కు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 4ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల కుటుంబంలో గొడవలు రావడంతో సునీత మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్ఐ గౌరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.