ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సమావేశాన్ని మర్యాదపూర్వక భేటీగా అభివర్ణించారు.నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ వెళ్లారు. న్యూ ఇండియాస్ న్యూ ఉత్తరప్రదేశ్ అభివృద్ధి పథంలో శరవేగంగా పురోగమిస్తోంది అని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.