మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలు ముఖ కాంతిని దెబ్బతీస్తాయి. అయితే కొన్ని చిట్కాల ద్వారా ఆ మచ్చలను పోగొట్టవచ్చు. కొన్ని నారింజ తొక్కలను పేస్టులా చేసి ముఖంపై మొటిమలున్న చోట అప్లై చేయాలి. అరగంటపాటు అలా వదిలేసి తరువాత కడిగేసుకోవాలి. తరచుగా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. కలబంద మచ్చలను పోగొట్టడంలోనూ సమర్ధవంతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జును మొటిమలున్న చోట రాస్తే సరిపోతుంది.