ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంతో ప్రజాదరణ కలిగిన నాయకుడని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీకాలం ఈనెల 10వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. వెంకయ్యనాయుడితో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. వెంకయ్యనాయుడు లాంటి నాయకులు అరుదుగా ఉంటారని మోదీ పేర్కొన్నారు.