ఏపీలోని అనంతపురం జిల్లాలో టమోట రైతులు నిరసన చేపట్టారు. తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ సర్కార్ ను కోరుతూ ఆందోళన చేశారు. క్లాక్ టవర్ వద్ద తాము పండించిన పంటను రోడ్లపై పోసి రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రైతులకు సబ్సిడీని వైసీపీ సర్కార్ ఎత్తివేయడం దారుణమన్నారు. నేడు టమాట బాక్స్‌కు రూ.40లు కూడా రాకపోవడం బాధాకరమన్నారు. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు.