స్టాక్ మార్కెట్లు నేడు కూడా లాభాల బాట పట్టాయి. నేడు 0.8 శాతం వృద్ధితో లాభాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ 465 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్ల లాభాలను చవిచూసింది. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, కోల్ ఇండియా షేర్లు లాభాలను పొందగా బీపీసీఎల్, ఎస్బీఐ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇకపోతే డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.79.21కు చేరింది.