జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సవాల్ విసిరారు. సినిమాలో బొమ్మలతో యాక్షన్ చేసే పవన్, కనీసం 3 కిలోమీటర్లు అయినా నాతో నడవగలరా అని ప్రశ్నించారు. మాటలు చెప్పినంత సులభంగా ప్రజాజీవితం ఉండదని ఆయన అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామంలో 'గడపగడపకు' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గ్రామంలో పవన్ కల్యాణ్ పోస్టర్లు అధికంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.