యూపీలో దారుణం జరిగింది. ప్రీతి శర్మ అనే మహిళ తన ప్రియుడు ఫిరోజ్ ను రేజర్ తో గొంతు కోసి చంపింది. ప్రీతి తన భర్తను వదిలేసి నాలుగేళ్లుగా ఫిరోజ్ తో సహజీవనం చేస్తోంది. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఫిరోజ్ నిరాకరించాడు. దీంతో ప్లాన్ ప్రకారం ఫిరోజ్ ను ప్రీతి హత్యచేసింది. మృతదేహాన్ని పడేసేందుకు పెద్ద సూట్‌కేసులో పెట్టింది. ఆమెపై పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది.