టిండర్ యాప్ తో సోదరీమణులను సొంతం చేసుకొన్నాడం ఏమిటీ అన్న సందేహం ఎవరికైనా కలగవచ్చు. నేడు కాలంతోపాటు ఎన్నో మారిపోయాయి. కాలు కదపకుండా ఆన్లైన్లోనే అన్ని జరిగిపోతున్నాయి. వస్తువులే కాదు.. స్నేహాలు, ప్రేమలు కూడా ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. కొత్త ఫ్రెండ్స్ కోసం, పెళ్లిళ్లల కోసం, ప్రేమల కోసం రకరకాల యాప్‌లు కూడా వచ్చేశాయి. అందులో టిండర్ యాప్ కూడా ఒకటి. అందులో మంచి పార్టనర్ కోసం యువతీ, యువకులు యాప్‌లో వెదుక్కుంటూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం వెరైటీగా అక్క, చెల్లెళ్ల కోసం ఈ యాప్‌ను ఆశ్రయించాడు. అయితే అందులో సక్సెస్ కూడా అయ్యాడు.
యువకుడు రాఖీ పండుగను ఆస్వాదించాలనుకున్నాడు. కానీ తనకు సొంత అక్క చెల్లెళ్లు లేరు. దాంతో ఏం చేయాలని బాగా ఆలోచించాడు. వెంటనే బుర్రలోకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. డేటింగ్ యాప్ అయిన టిండర్‌లో సెర్చింగ్ మొదలుపెట్టాడు. తనకు మంచి సోదరిగా మెలిగే వ్యక్తి కోసం వెదికాడు. ఇంకేముంది ఇద్దరి అమ్మాయిలు దొరికేశారు. దీంతో రాఖీ పండుగను ఘనంగా జరుపుకోవడానికి ఆ వ్యక్తి రెడీ అయిపోయాడు.
రక్షాబంధన్ సందర్భంగా తను మంచి సోదరి కోసం వెదికానని తన సోషల్ మీడియాలో కూడా వెల్లడించాడు. తనకు రాఖీ కట్టడానికి .. గిఫ్ట్‌లు ఇవ్వడానికి ఎవరూ లేరని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది టిండర్‌లో చెల్లెళ్లు కోసం వెదికానని, ఇద్దరు దొరికారని .. ఇక రాఖి పండుగ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు. వారితో రాఖీ పండుగను జరుపుకోబోతున్నట్టు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆ యువకుడు టిండర్ యాప్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు. "టిండర్కి ధన్యవాదాలు, ఇప్పుడు నేను ఇద్దరు అక్కచెల్లెళ్లను కలిగి ఉన్నాను. వారిద్దరిని నేను టిండర్‌లో కలుసుకున్నాను. ఈ ఏడాది మేం ముగ్గురం కలిసి రక్షాబంధన్‌ని జరుపుకోవడానికి, గిఫ్ట్నలు ఇచ్చుకోవడాని ప్లాన్ చేస్తున్నాం. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను." అని రాడిట్‌లో తెలియజేశాడు. అయితే దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
గతంలో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ డేటింగ్ ఫ్లాట్‌ఫామ్‌లో ఒక వ్యక్తి అద్దెకి ఫ్లాట్‌ను వెదికాడు. ముంబైలో ఫ్లాట్ కోసం చూస్తున్నానని సంబంధిత యాప్ బయోలో రాశాడు. అంతేకాదు. "మీరు ముంబైలో ఉంటే కుడివైపుకి స్వైప్ చేయండి. నాకు హిందీ తెలియదు కాబట్టి వెస్ట్రన్ లైన్లో అద్దెకు ఫ్లాట్‌ను కనుగొనడంలో నాకు సాయం చేయండి." అని రాశాడు. మరీ ఆయన ప్రయత్నాలు ఫలించాయో లేదో తెలియదు.. అప్పట్లో ఈ న్యూస్ ట్రెండ్ అయింది. దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్లు పెట్టారు.