బ్యాంకులను నమ్మకొంటే అంతే సంగతులు అన్న పరిస్థితి ఈ వారంలో నెలకొంది. కారణం బ్యాంకులకు వరుసగా సెలవులు వచ్చాయి. కేవలం ఒక్క రోజు మాత్రమే ఈ వారంలో బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ వారం బ్యాంకుకి సంబంధించిన పని ఏమైనా ఉంటే.. వాటిని ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. ఈ వారంలో ఆరు రోజుల పాటు బ్యాంకులు సెలవును పాటించనున్నాయి. ఏదైనా పని కోసం బ్యాంకు బ్రాంచుకి వెళ్లాలనుకుంటే మాత్రం.. ఈ సెలవుల జాబితాను తెలుసుకుని వెళ్లడం మంచిది.
ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం, ఈ రోజు, రేపుతో పాటు గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు. అంటే ఆగస్టు 8, 9, 11, 12, 13, 14 తేదీల్లో బ్యాంకులకు సెలవు ఉంది. రక్షా బంధన్, మొహర్రం వంటి పండుగలతో పాటు శని, ఆదివారాలు కూడా కలిసి వచ్చాయి. దీంతో ఈ వారంలో ఆరు రోజుల పాటు బ్యాంకులు క్లోజ్‌లోనే ఉంటాయి. కేవలం బుధవారం మాత్రమే బ్యాంకులు తెరుచుకుని ఉంటాయి. బ్యాంకు బ్రాంచుకి వెళ్లాలనుకున్న వారు బుధవారం వెళ్లి తమ పనిని పూర్తి చేసుకోవచ్చు.
మొహర్రం పండగ సందర్భంగా నేడు జమ్మూ, శ్రీనగర్‌లోని బ్యాంకులు సెలవును పాటిస్తున్నాయి. హైదరాబాద్, అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, బెలాపూర్, బెంగళూరు, భోపాల్, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచి ప్రాంతాలలో మొహర్రం సందర్భంగా రేపు బ్యాంకులకు సెలవు ఉంది. అలాగే ఆగస్టు 11న రక్షా బంధన్ సందర్భంగా అహ్మదాబాద్, భోపాల్, డెహ్రడూన్, జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు. కాన్పూర్, లక్నో ప్రాంతాలలో రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 12న బ్యాంకులు సెలవు పాటిస్తున్నాయి. ఆగస్టు 13, 14 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం వచ్చాయి. దీంతో సాధారణంగా బ్యాంకులకి రెండో శనివారం సెలవు. ఇలా ఈ వారంలో ఆరు రోజుల పాటు వివిధ ప్రాంతాలలో బ్యాంకులు మూతపడుతున్నాయి. ఆ తర్వాత సోమవారం ఆగస్టు 15 కావడంతో.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకుల సెలవుల జాబితాను ప్రతి ఆర్థిక సంవత్సరం నిర్ణయిస్తుంది. ప్రతి రాష్ట్రంలో ఈ సెలవులు భిన్నంగా ఉంటాయి. మూడు కేటగిరీల కింద బ్యాంకులకు సెలవులను ఇస్తుంది ఆర్‌బీఐ. దీనిలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సెలవులు, అకౌంట్ క్లోజింగ్ సెలవులు ఉంటాయి. ఈ నెల మొత్తాన్ని చూసుకుంటే.. మొత్తంగా 18 రోజుల పాటు బ్యాంకులకు సెలవు ఉంది.