ఒక జంట తమ పెళ్లి మండపంపైన సరదాగా మొదలైన గొడవ మీదపడి కొట్టుకునే వరకూ వెళ్లింది. వధువు వరుడిపై పడి రచ్చ చేస్తుంది. చుట్టుపక్కల వారు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే, ఈ గొడవ వెనుక కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. నెటిజనులు కూడా కారణం తెలియక తలగోక్కున్నారు. ఈ రచ్చకు రీజన్ తెలియకపోయినా ఇన్స్టాలో కామెంట్లతో నిండుతోంది.