తాడేపల్లి: సీతానగరం పుష్కర్ ఘాట్ లో సోమవారం సాయంత్రం గల్లంతైన విద్యార్థి నిమ్మగడ్డ నాగర్జున(19) మృతదేహం కోసం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు పర్యవేక్షణలో గాలింపు సాగుతుంది. ఈ మేరకు తాడేపల్లి సీఐ శేషగిరిరావు మాట్లాడుతూ కృష్ణానది ప్రవాహం ఎక్కువ ఉండటంతో యువకుని మృతదేహం లభించడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందని, మృతదేహం లభించే వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa