నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను బీరు సీసాలతో కొట్టి చంపిన దారుణ ఘటన ఏపీలోని నంద్యాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి పట్టణంలోని టాటూ దుకాణం వద్ద కానిస్టేబుల్ సురేంద్రకుమార్‌ను(35) రౌడీషీటర్లు దారుణంగా కొట్టి చంపేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవ్వడంతో సోమవారం వెలుగులోకి వచ్చి వైరలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa