యూపీలోని ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో ఓ బ్యాంకు మేనేజర్ ఇద్దరు దుండగులు యాసిడ్ దాడి చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో సీనియర్ మేనేజర్ దీక్షా సోంకర్ (34) స్కూటీపై వెళ్తుండగా ఇద్దరు యువకులు ఆమెను ఆపారు. ఒక్కసారిగా ఆమె ముఖంపై యాసిడ్ పోయగా, తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ హేమ్రాజ్ మీనా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.